పిల్లల మరణ వార్తతో తండ్రికి గుండెపోటు
తన ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విన్న పిల్లల తండ్రి యూసఫ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఈ రోజు మెదక్ జిల్లాలో స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు చనిపోయారు. వీరిలో కిష్టాపూర్ కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గుండెపోటుకు గురైన యూసఫ్ పిల్లలు.